అంతిమంగా మిగిలేది ప్రేమే: కోహ్లి

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఇటీవలే 31వ వసంతంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. నవంబర్‌ 5వ తేదీన కోహ్లి తన భార్య, బాలీవుడ్‌ స్టార్‌ నటి అనుష్కశర్మతో కలిసి భూటాన్‌లో పుట్టినరోజును వేడుకలను జరుపుకున్నారు. తాజాగా తన భార్య అనుష్కతో కలిసిన దిగిన కొన్ని ఫోటోలను విరాట్‌ సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకోన్నారు. ప్రసుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. తన భార్య అనుష్క గురించి విరాట్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ అనుష్కతో జీవితాన్ని ఆస్వాధిస్తున్నానని అంతిమంగా తామిద్దరి మద్య మిగిలేది ప్రేమేనంటూ చెప్పుకొచ్చాడు.


 

Popular posts